పథకాలు, నిధులను వివరించండి.. | - | Sakshi
Sakshi News home page

పథకాలు, నిధులను వివరించండి..

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

ఖమ్మంసహకారనగర్‌: రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటితో ప్రజలకు జరుగుతున్న లబ్ధిని వివరించేలా గ్రామసభలు నిర్వహించాలని డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఆయన సీఎస్‌ రామకృష్ణారావుతో కలిసి వీసీ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. బుధవారం నుంచి జరిగే గ్రామసభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించా లని తెలిపారు. ఈ సభల్లో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారి పేర్లుప్రకటించడమే కాక ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సన్న బియ్యం అందుకుంటున్న వారితో మాట్లాడించాలని తెలిపారు. అలాగే, ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ తదితర అంశాలను వివరించాలని, ఇప్పటి వరకు ఆయా ప్రాంతాలకు మంజూరైన నిధుల వివరాలు వెల్లడించాలని సూచించారు. వీసీకి జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ హాజరు కాగా, ఆ తర్వాత అధికారులతో సమావేశమైన ఆమె గ్రామసభల నిర్వహణపై సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, సీపీఓ శ్రీనివాస్‌, డీపీఓ రాంబాబు, డీఎల్‌పీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement