కొణిజర్ల: వైరా మున్సిపాలిటీ పరిధి కొణిజర్ల మండలం లాలాపురంలో బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామి ఊరేగింపు జరుగుతుండగా మొదలైన వివాదం రాళ్ల దాడిగా మారడంతో పలువురు గాయపడ్డారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాలు.... కాంగ్రెస్ వర్గీయులు సీతారాముల కళ్యాణం అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తుండగా, బీఆర్‌ఎస్ వర్గీయుల ఊరేగింపు ఎదురురావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమాన రాళ్లు రువ్వుకోగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలియడంతో వైరా సీఐ వెంకటప్రసాద్ నేతృత్వాన కొణిజర్ల, వైరా, చింతకాని పోలీసులు చేరుకుని ఇరువర్గాల చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆపై గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటుచేశారు.
మొక్కజొన్న యంత్రం దగ్ధం
ముదిగొండ: విద్యుత్ తీగలు తాకడంతో మొక్కజొన్న యంత్రం దగ్ధమైన ఘటన ఇది. ముదిగొండ మండలం గంధసిరిలోని ఓ రైతు పొలంలో శుక్రవారం యంత్రంతో మొక్కజొన్న కోస్తున్నారు. ఈసమయాన పైన ఉన్న విద్యుత్ తాకడంతో యంత్రం కాలిపోయింది. మంటలు మొదలుకాగానే అప్రమత్తమైన డ్రైవర్ హుసేన్ కిందకు దూకడంతో గాయాలతో బయటపడ్డాడు.
లాలాపురంలో రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు


