ఖమ్మంగాంధీచౌక్: పశ్చిమ దేశాల యుద్ధం సమసిపోయి ప్రపంచ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఏప్రిల్ 4వ తేదీన ఖమ్మంలో రన్ ఫర్ జీసస్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్సీఎం బిషప్ సగిలి ప్రకాష్ తెలిపారు. ఈమేరకు ఖమ్మంలోని బిషప్ హౌస్‌లో కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.క్రైస్తవ సంఘాల ఆధ్వర్యాన నిర్వహించే రన్ ఫర్ జీసస్ 4వ తేదీన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వద్ద సాయంత్రం 6 గంటలకు మొదలై ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ కాలేజీ వరకు కొనసాగుతుందని, ఫాదర్లు, ఫాస్టర్లు, విశ్వాసులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో కోఆర్డినేటర్ తప్పెట్ల శౌరి, మత గురువులు సూరేపల్లి ఐజక్, విజయ్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


