ఖమ్మం లీగల్: ఖమ్మంలోని న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఉదయం 10–30గంటలకు ప్రారంభిస్తారు. కాగా, ఎక్కువ కేసులు పరిష్కరించేలా ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, న్యాయవాదులతో జిల్లా జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కల్పన పలుమార్లు సమావేశమయ్యారు. ఈమేరకు కేసుల పరిష్కార నిమిత్తం పలు బెంచ్‌లను ఏర్పాటుచేస్తుండగా కక్షిదారులు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు.


