నేడు ‘నిధి ఆప్‌ కే నికట్‌’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘నిధి ఆప్‌ కే నికట్‌’

Mar 27 2026 9:20 AM | Updated on Mar 27 2026 9:20 AM

ఖమ్మం సహకారనగర్‌/ఖమ్మం రూరల్‌: ఉద్యోగుల భవి ష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ఆధ్వర్యాన శుక్రవారం నిధి ఆప్‌ కే నికట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఎఫ్‌ ప్రాంతీయ కమిషనర్‌ వై.డీ.శ్రీనివాస్‌ తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లగూడెంలోని జీవీ మాల్‌ గోదాంలో జరిగే కార్యక్రమంలో సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, పింఛనుదారులకు విధివిధానాలు, పీఎం వికసిత భారత్‌ రోజ్‌గార్‌ యోజనపై అవగాహన కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉదయం 9–30నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ సూచించారు.

ఐఐటీహెచ్‌ నుంచి డాక్టరేట్‌

కల్లూరు: మండలంలో ని వెన్నవల్లి మాజీ సర్పంచ్‌ కొండపల్లి శ్రీమన్నారాయణ కుమార్తె మాధవికి డాక్టరేట్‌ లభించింది. ప్రొఫెసర్‌ సి.కృష్ణమోహన్‌ పర్యవేక్షణలో ఆమె వాతావరణ మార్పులపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి ఐఐటీ హైదరాబాద్‌ నుంచి డాక్టరేట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మాధవిని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, కాంగ్రెస్‌ నాయకుడు మట్టా దయానంద్‌ తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement