భద్రాచలం ఉత్సవ కమిటీలో స్థానం | - | Sakshi
Sakshi News home page

భద్రాచలం ఉత్సవ కమిటీలో స్థానం

Mar 27 2026 9:19 AM | Updated on Mar 27 2026 9:19 AM

వైరా/నేలకొండపల్లి: భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యాన జరిగే శ్రీరామనవమి వేడుకల నిమిత్తం దేవా దాయశాఖ ఉత్సవకమిటీని ఏర్పాటుచేశారు. శ్రీ రామనవమి వేడుకలు విజయవంతంగా సాగేలా పర్యవేక్షణకు 14మందితో ఏర్పాటుచేసిన కమిటీ 26నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈమేరకు భక్తరామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిమండలం నుంచి ఇద్దరికి స్థానం దక్కింది. నేలకొండపల్లికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు దోసపాటి చంద్రశేఖర్‌, మండలంలోని రాజేశ్వరపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ మండల మాజీ అధ్యక్షుడు దండా సత్యనారాయణను నియమించారు. ఇందులో సత్యనారాయణను రాజేశ్వరపురంలో గురువారం కాంగ్రెస్‌ నాయకులు పగిళ్ల పృధ్వీ, చిట్యాల రమేష్‌ తదితరులు సన్మానించారు. అలాగే, వైరాకు చెందిన మిట్టపల్లి నాగేశ్వరరావు(నాగి), రంగా జనార్దనరావు కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తమ ఎంపికకు సహకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌, ఽడీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

భూదాన్‌ భూముల్లో ఇళ్ల కోసం పోరాటం

ఖమ్మంఅర్బన్‌: భూదాన్‌ భూమిలో ఇళ్లు కోల్పోయి పట్టాలు రాని వారు ఖమ్మంలోని టీఎన్‌జీఓస్‌ హాల్‌లో గురువారం సమావేశమయ్యారు. సుమారు 300 మంది హాజరుకాగా, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల సాధన కమిటీ బాధ్యులు జి.సత్యనారాయణరెడ్డి, వరగాని కోటేశ్వరరావు, బొల్లు వెంకట్‌, జంగం రామచంద్రయ్య మాట్లాడారు. ప్రభుత్వం పట్టాలు, ఇళ్లు మంజూరు చేసే వరకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement