చింతకాని: మండలంలోని మత్కేపల్లిలో వివా దాస్పదంగా మారిన భూమిని రెవెన్యూ ఉద్యోగులు గురువారం సర్వే చేశారు. మత్కేపల్లి రెవెన్యూ పరిధి 367వ సర్వే నంబర్‌లో 12.35 ఎకరాల పట్టా భూమి ఉండగా, ఇందులో ఎస్సీలకు ఇళ్ల స్థలాల కోసం 1981లో 4.32 ఎకరాలను ప్రభుత్వం అందజేసింది. మరో 7.04 ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటుండగా 39 కుంటలను కొందరు ఆక్రమించుకోవడంతో వివాదం ఏర్పడింది. ఈవిషయమై ఘర్షణ జరగగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆపై వివరాలను తేల్చేందుకు తహసీల్దార్ ఆదేశంతో గ్రామపెద్దల సమక్షాన సర్వే చేపట్టగా పట్టాదారులకు చెందిన 39 కుంటల భూమి ఆక్రమణకు గురైందని అధికారులు నిర్ధారించారు. సర్వేలో ఉద్యోగులు ఏకవీర, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 29న రెండు జిల్లాలస్థాయి
చెస్ పోటీలు
రుద్రంపూర్: కొత్తగూడెంలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్‌లో ఈ నెల 29న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల చైర్మన్ డాక్టర్ వి.సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అండర్–12, 15 విభాగాల్లో జరిగే పోటీల్లో మొదటి 15 స్థానాలు సాధించే బాలబాలికలకు 30 ట్రోఫీలు అందిస్తామని వెల్లడించారు. స్విస్ లీగ్ పద్ధతిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు 94401 62749, 91822 25496 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సొంత చెస్‌బోర్డ్‌తో ఆదివారం ఉదయం 9 గంటలకు గౌతమ్‌నగర్‌లోని గీతాంజలి పబ్లిక్ స్కూల్‌లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. సమావేశంలో చెస్ క్రీడాకారుడు సీహెచ్ గోపీకృష్ణ, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.


