ఖమ్మంక్రైం: ఖమ్మం కొత్త బస్టాండ్ పరిసరాల్లో గురువారం తనిఖీలు చేపట్టిన ఎకై ్సజ్ స్టేషన్–1 పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద తనిఖీచేయగా 2.990 కిలో ల గంజాయి లభించింది. వారిని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ టైలర్‌కాలనీకి చెందిన సి.శ్రీకాంత్, భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన నాగంటి నవీన్‌గా గుర్తించారు. పాల్వంచలో కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు తేలడంతో వారిని రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ బి.కృష్ణ, సబ్ ఇన్‌స్పెక్టర్ రేష్మసుల్తానా, ఉద్యోగులు పాల్గొన్నారు.


