ప్రధాన కార్యదర్శిగా రవి విజయం
ఖమ్మం లీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులుగా ఎడ్లపల్లి రమేష్, కొప్పుల రవి ఎన్నికయ్యారు. కార్యవర్గంలోని మిగతా పదవులు ఏకగ్రీవంగా కాగా.. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు పలువురు పోటీ పడడంతో గురువారం పోలింగ్ నిర్వహించారు. ఈమేరకు అధ్యక్ష స్థానానికి పోటీలో ఉన్న రమేష్‌కు 349, మోజస్ క్రిస్టోఫర్‌కు 255ఓట్లు రావడంతో రమేష్ 64కోట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలా గే, ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన కొప్పుల రవికి 478ఓట్లు, వెంకటనారాయణకు 200 ఓట్లు పోలయ్యాయి. దీంతో 278 ఓట్లతో రవి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.


