ఖమ్మం లీగల్: ఇటీవల రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై న ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది మందడపు శ్రీనివాసరావు బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌నును కలిశారు. ఈ సందర్భంగా జడ్జి ఆయనను అభినందించారు. న్యాయవాదులు ఏడునూతల శ్రీనివాసరావు, దంతాల నారాయణ, ఇమ్మడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రేపు డాక్ అదాలత్
ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలకు సంబంధించి ఈనెల 27వ తేదీన శుక్రవారం ఉదయం 11గంటలకు ఆన్‌లైన్‌లో డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను ‘డాక్ అదాలత్’ పేరిట గురువారం వరకు ఖమ్మం పోస్టల్ డివిజన్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఫిర్యాదువెంట సెల్ నంబర్, ఈ–మెయిల్ పొందుపరిస్తే ఆన్‌లైన్‌లో జరిగే అదాలత్‌లో పాల్గొనవచ్చని తెలిపారు.


