అప్రమత్తంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా వ్యవహరించాలి

Mar 26 2026 7:27 AM | Updated on Mar 26 2026 7:27 AM

వైరా: ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. వైరా నియోజకవర్గ స్థాయి అధికారులకు వైరాలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సవరించాలని తెలిపారు. అలాగే, 18ఏళ్లు నిండి వారి నమోదు, అనర్హుల తొలగింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమనే అంశాన్ని వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐదు మండలాల తహసీల్దార్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement