● వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి ● డీసీసీబీ మహాసభలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంవ్యవసాయం: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సహకార సంఘాలు కృషి చేయాలని కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి అనుదీప్ దురిశెట్టి సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) 128వ మహాజన సభ బుధవారం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. సహకార సంఘం ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడమే కాక వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు, చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే, పీఏసీఎస్‌ల్లో వివరాలు నమోదు చేసే సమయాన పొరపాట్లతో రైతులకు నష్టం జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొరపాట్లను పదిహేను రోజుల్లో సవరించకపోతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, రుణాలు సకాలంలో చెల్లించేలా రైతులకు అవగాహన కల్పిస్తూ, వారు ఉత్పత్తులు తయారు చేసే స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. తొలుత బ్యాంక్ ప్రగతి, పీఏసీఎస్‌ల బలోపేతంపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసమావేశంలో నాబార్డ్ డీడీఎం ఎల్.సుజిత్‌కుమార్, టీఎస్ సీఏబీ డీజీఎం కె.రవికాంత్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకటఆదిత్య, భద్రాద్రి డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ పనులు తనిఖీ
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని జిల్లా గ్రంథాల యం అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూనే గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించా రు. లైబ్రరీ ఆవరణలో అదనపు భవనం, ప్రహరీ, టాయిలెట్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి అధికా రులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారు, ఇంకా ఏమైనా పుస్తకాలు అవసరమా అని ఆరా తీశా రు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు భాస్కర్‌రావు, అఖిల్, రవిబాబు పాల్గొన్నారు.


