సత్తుపల్లిరూరల్: యుద్ధం ప్రభావంతో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడగా.. పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగ్గుతున్నాయనే ప్రచారం వాహనదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈమేరకు బుధవారం రాత్రి సత్తుపల్లిలోని బంక్‌ల్లో పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారులు క్యూ కట్టారు. పలువురు వాహనాల ట్యాంకుల్లో ఇంధనం నింపించడమే కాక 10, 20, 50 లీటర్ల క్యాన్లలో తీసుకెళ్లడం కనిపించింది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. ప్రతిరోజు ట్యాంకర్లు వస్తున్నాయని బంక్‌ల యాజమానులు చెప్పినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.


