మార్కెట్లలో మిర్చి రైతులకు సదుపాయాలు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లలో మిర్చి రైతులకు సదుపాయాలు

Feb 26 2026 8:35 AM | Updated on Feb 26 2026 8:35 AM

మార్క

మార్కెట్లలో మిర్చి రైతులకు సదుపాయాలు

ఖమ్మవ్యవసాయం: ఖమ్మం, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లలో సదుపాయాలను మిర్చి రైతులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. మిర్చి తీసు కొచ్చే రైతులు కొనుగోళ్లు పూర్తయ్యే వరకు షెడ్లలో నిల్వ చేసుకోవచ్చని, తద్వారా అకాల వర్షాలతో నష్టం ఉండదని తెలిపారు. టార్పా లిన్లు కూడా సమకూరుస్తారని పేర్కొన్నారు. అత్యవసరమైతే ఉదయం వేళ ఖమ్మం మార్కెట్‌లో ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌(73307 33375), రాత్రివేళ సహాయ కార్యదర్శి పి.వీరాంజనేయులు (73307 3338), ఏన్కూరు మార్కెట్‌లో సూపర్‌వైజర్‌ బి.రామారావు (73307 33408)ను సంప్రదించాలని అదనపు కలెక్టర్‌ ఒక ప్రకటనలో సూచించారు.

బ్యాంక్‌ లావాదేవీలపై

అవగాహన తప్పనిసరి

ఖమ్మంమయూరిసెంటర్‌: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బ్యాంకు లావాదేవీలపై సీసీలు, ఏపీఎంలు అవగాహన కల్పించా లని డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్‌ సూచించా రు. ఉమ్మడి జిల్లాలోని సెర్ప్‌ సీసీలకు ఆర్థిక అక్షరాస్యతపై ఖమ్మంలోని జిల్లా సమాఖ్య భవనంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకునేలా చైతన్యం కల్పించాలని తెలిపారు. అలాగే, బ్యాంక్‌ లింకేజీ, సీ్త్రనిధి రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ, ప్రభుత్వం నుంచి తిరిగి ఎంత వస్తుందో అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో అడిషనల్‌ డీఆర్‌డీఓ జయశ్రీ, బ్యాంక్‌ లింకేజీ డీపీఎం ఆంజనేయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తప్పిపోయిన బాలుడి అప్పగింత

ముదిగొండ: మండలంలోని గంధసిరిలో పోలీసులు బుధవారం పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఓ పదేళ్ల బాలుడు కనిపించాడు. ఆయన వెంట ఎవరూ లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ తీసుకువచ్చి ఆరాతీయగా పేరు కట్ట పెనుగొండయ్య అని, తమది జగ్గయ్యపేట అని చెప్పాడు. దీంతో బాలుడి తల్లి విజయకుమారికి సమాచారం ఇవ్వగా తప్పిపోయిన తమ కుమారుడి కోసం వెతుకుతున్నట్లు చెప్పిన ఆమె ముదిగొండకు రావడంతో బాలుడిని అప్పగించగా కృతజ్ఞతలు తెలిపింది.

నకిలీ పైపుల

స్వాధీనం

ఖమ్మంక్రైం: ఆశీర్వాద్‌ కంపెనీని పోలిన నకిలీ పైపులు విక్రయిస్తున్న దుకాణం యాజమానిపై ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం పీఎస్‌ఆర్‌ రోడ్డులోని జగదంబా ఎంటర్‌ప్రైజెస్‌లో నకిలీ పైపులు అమ్ముతున్నారనే సమాచారంతో కంపెనీ బాధ్యులు తనిఖీ చేపట్టా రు. ఈ సందర్భంగా రూ.40 వేల విలువైన పైపు లు లభించడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్‌బాబు తెలిపారు.

కుల దూషణపై

కేసు నమోదు

ఖమ్మంఅర్బన్‌: ఓ కులాన్ని దూషిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మంఅర్బన్‌ సీఐ భానుప్రకాష్‌ తెలిపారు. ఖమ్మం బ్రాహ్మణబజార్‌కు చెందిన పసుమర్తి సతీశ్‌ తన ఫేస్‌బుక్‌లో భట్రాజు కులస్తులను కించపరుస్తూ పోస్టు చేశాడు. ఈ విషయమై భట్రాజు కులస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదైంది.

మార్కెట్లలో మిర్చి రైతులకు సదుపాయాలు
1
1/1

మార్కెట్లలో మిర్చి రైతులకు సదుపాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement