మ.. మ.. మాస్క్‌! | - | Sakshi
Sakshi News home page

మ.. మ.. మాస్క్‌!

Feb 22 2026 7:08 AM | Updated on Feb 22 2026 7:08 AM

మ.. మ

మ.. మ.. మాస్క్‌!

బూరుగు కలప.. 18 రోజులు శ్రమ జీఐ గుర్తింపు కోసం

ప్రభుత్వ అండ లభిస్తే..

ప్రత్యేక ఆకర్షణగా

నాయక్‌పోడు బొమ్మలు

ఇంటి గోడలకూ

అలంకారంగా కళాకృతులు

ములకలపల్లి మండలంలో

తయారీదారులు

మేడారం జాతర సందర్భంగా ముఖానికి చెక్క మాస్క్‌ ధరించిన కొందరు గిరిజనులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జాతరే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గిరిజన జాతరలు జరిగినా ఉపయోగించే మాస్క్‌లు భద్రాద్రి జిల్లా నుంచే వెళ్తుండడం విశేషం. చెక్కను చేతితో చెక్కి రంగులతో తీర్చిదిద్దే మాస్క్‌ల తయారీ వెనుక ఉన్న కళాకారుల ‘ముఖ’చిత్రమిది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

వివిధ రూపాల్లోని నాయక్‌పోడు మాస్క్‌లు

దేవేరుల రూపాలతో..

రాష్ట్రంలో సంప్రదాయంగా నివసిస్తున్న గిరిజన తెగల్లో నాయక్‌పోడులు కూడా ఉన్నారు. వీరు లక్ష్మీదేవరను ఇలవేల్పుగా పూజిస్తూ మాఘమాసంలో జాతర నిర్వహిస్తారు. భద్రాద్రి జిల్లాలోని పినపాక మండలం చేగర్శలలో ఈ తిరునాళ్లు జరుగుతాయి. లక్ష్మీదేవరతో పాటు పంచపాండవులను కొర్రాజులుగా, కృష్ణుడిని కిట్టయ్యగా, మద్దిరామక్క, గట్టు ముసలమ్మ, ఎర్రమ్మ తదితర దేవరలను కూడా కొలుస్తారు. దేవరలతో పాటు నాయక రాజ్యాలను ఏలిన ప్రోలయ, సింగబోయుడు, మైసమ్మ, పోతురాజు, గుర్రపోతు, పందిరాజును ఆరాధిస్తారు. నాయక్‌పోడులకు సంబంధించి 14 పవిత్ర స్థలాలు, పవిత్ర జాతరలు ఉన్నాయి. ఈ ఉత్సవాల సమయంలో దేవేరులను పోలిన చెక్కతో చేసిన ముఖ తొడుగులు (చెక్క మాస్క్‌)లను ధరించి నృత్యం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, జిల్లాలోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గిరిజన జాతరలు జరిగినా ఈ మాస్క్‌లు సింహభాగం ములకలపల్లి మండలం మాధారంలోనే తయారవుతున్నాయి.

అలంకరణలోనూ

నాయక్‌పోడు గిరిజనులు జాతరల సందర్భంగా ధరించే మాస్క్‌లు విశేష ప్రాచుర్యం పొందాయి. దీంతో ఈ తెగకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందు గిరిజన తెగ అంటే కోయ, గొత్తికోయ, గోండులే అన్నట్టు ఉండేది. కానీ చెక్క మాస్క్‌లతో నాయక్‌పోడుల ప్రత్యేకత కూడా పరిచయమైంది. ఇదే సమయంలో చెక్క మాస్క్‌ల తరహాలోనే గిరిజనులు పూజించే దేవేరుల చెక్కబొమ్మలు ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా నిర్వహించే ఎగ్జిబిషన్లు, కార్యక్రమాల్లో వీటిని ప్రదర్శించడం, బహూకరించడంతో పాటు క్రమంగా చాలా మంది తమ ఇళ్లలోనూ దేవేరుల బొమ్మలను గోడలకు అలంకరిస్తున్నారు. అయితే జాతరలో ధరించే చెక్క మాస్క్‌కు వెనుక భాగంలో బోలుగా ఉంటే, గోడలకు అలంకరించే బొమ్మల వెనుక భాగం సమంగా ఉంటుంది.

బొమ్మల తయారీకి కలప వినియోగించేవాళ్లం. ఇక్కడ అడవుల్లో ఈ కలప లభ్యం లభించక బూరుగు కలపతోనూ తయారు చేస్తున్నాం. కలపను బొమ్మ రూపంలో చెక్కి నునుపుదనం తీసుకొచ్చాక రంగులు అద్దుతాం. ఇదంతా జరగడానికి 18 రోజులు పడుతుంది. చిన్న బొమ్మలైతే ఐదు రోజుల్లో పూర్తవుతాయి. పూర్తిగా చేతి పని కావడంతో కళాఖండాల ఖరీదు రూ.600 నుంచి మొదలవుతుంది.

– పసుల అంజన్‌, నాయక్‌పోడు కళాకారుడు

చెత్తతో చేసే మాస్క్‌ల తయారీ అరుదైన కళ. దీనికి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌) తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం కళాకారులు ఇప్పటికే దరఖాస్తు కూడా చేశారు. తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు కోసం వెళ్లిన 29వ దరఖాస్తుగా నాయక్‌పోడు వుడెన్‌ మాస్క్‌/ బొమ్మలు ఉన్నాయి.

– అరవింద్‌ ఆర్యా, ‘టార్చ్‌’ కార్యదర్శి

ఒకప్పుడు నాయక్‌పోడు తెగకు సంబంధించి మొత్తం 52రకాలైన దేవేరుల బొమ్మలు తయారయ్యేవి. కానీ బొమ్మలు తయారుచేసే కుటుంబాల సంఖ్య పరిమితంగా ఉండడం, అందులోనూ కొన్ని రకాల బొమ్మలనే ఎక్కువగా తయారు చేస్తుండడంతో క్రమంగా మిగతావి కనిపించకుండా పోతున్నాయి. ప్రస్తుతం 24 రకాల బొమ్మల తయారీలోనే ఈ తరం కళాకారులకు నైపుణ్యం ఉంది. ఈ నేపథ్యంలో కళను భావితరాలకు అందించ డం, అన్ని రకాల బొమ్మల తయారీకి ప్రభుత్వం తరఫున ఆర్డర్లు రావాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో హస్తకళా ఖండాలు ఈ – కామర్స్‌లో అమ్మకానికి ఐటీడీఏ తోడ్పాటు అందించాలని వారు కోరుతున్నారు.

జాతర ఏదైనా తయారీ ఇక్కడే...

మ.. మ.. మాస్క్‌!1
1/6

మ.. మ.. మాస్క్‌!

మ.. మ.. మాస్క్‌!2
2/6

మ.. మ.. మాస్క్‌!

మ.. మ.. మాస్క్‌!3
3/6

మ.. మ.. మాస్క్‌!

మ.. మ.. మాస్క్‌!4
4/6

మ.. మ.. మాస్క్‌!

మ.. మ.. మాస్క్‌!5
5/6

మ.. మ.. మాస్క్‌!

మ.. మ.. మాస్క్‌!6
6/6

మ.. మ.. మాస్క్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement