సంత్ సేవాలాల్ ఆదర్శప్రాయుడు
అదనపు కలెక్టర్ శ్రీజ, వైరా ఎమ్మెల్యే రాందాస్
వైరా/కారేపల్లి/కొణిజర్ల: సంత్ సేవాలాల్ మహరాజ్ అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా బంజారా జాతికి మంచి గుర్తింపు లభిస్తుందని అదనపు కలెక్టర్ శ్రీజ, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ అన్నారు. కారేపల్లిలో శనివారం సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో భాగంగా భోగ్ భండారో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతి ఐక్యత, జాతి అభ్యున్నతి కోసం సంత్ సేవాలాల్ మహరాజ్ బ్రిటీష్ పాలకులు, మొఘలులతో పోరాడారని తెలిపారు. అలాగే, వైరాలోని పాత తండా రైతు వేదిక భవనం, కొణిజర్ల మండలంలోని రాజ్యతండా, అమ్మపాలెం శివారు సంత్ సేవాలాల్ దేవాలయం వద్ద నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే రాందాస్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయకుమారి, ఉత్సవాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ జ్యోతి, సీఐ సాగర్, వైరా మార్కెట్ చైర్మన్ బోళ్ల రంగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, ఎంపీడీఓలు సక్రియా, గుగులోత్ వర్ష, తహసీల్దార్లు నారపోగు అరుణ, సురేష్, రమేష్, ఎంపీఓ ఆర్.ఉపేంద్రయ్య, సర్పంచ్‌లు మేదరి టోనీ వీరప్రతాప్, బానోత్ పుష్పావతి, షేక్ గాలీబ్ పాషా, నాయకులు, ప్రజాప్రతినిధులు ధీరావత్ వెంకటేశ్వర్లు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, ఏదునూరి సీతారాములు, శీలం వెంకటనర్సిరెడ్డి, కట్ల రంగారావు, ముళ్లపాటి సీతారాములు, బానోత్ నాగేశ్వరరావు, వడ్డె నారాయణరావు, సూరంపల్లి రామారావు, రాజ్‌కుమార్ జాదవ్, దేవ్లానాయక్, పగడాల మంజుల, శ్రీనివాసరావు, బానోతు హీరాలాల్, బాలునాయక్, గోపాల్, శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.


