రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Feb 22 2026 7:08 AM | Updated on Feb 22 2026 7:08 AM

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

నిత్యాన్నదానానికి విరాళం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మానికి చెందిన శీలం లలిత రూ.లక్ష ఆలయ అధికారుల కు అందజేయగా పర్యవేక్షకులు లింగాల సాయిబాబా రశీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

4న స్వర్ణ లక్ష్మీ అమ్మవారి పూజ

మార్చి 4వ తేదీన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో స్వర్ణలక్ష్మీ అమ్మవారి పూజా మహోత్సవం జరపనున్నట్లు ఈఓ దామోదర్‌రావు తెలిపారు. ఈ పూజలలో పాల్గొనే భక్తులు రూ.600 చెల్లిస్తే అమ్మవారి వెండి ప్రతిమ, జాకెట్‌ పీసు, ప్రసాదం అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే 3, 4వ తేదీల్లో నిత్యకల్యాణాలు రద్దుచేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement