గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

Feb 22 2026 7:08 AM | Updated on Feb 22 2026 7:08 AM

గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

● సుపరిపాలనతో సర్పంచ్‌లకు మంచి పేరు ● శిక్షణ ముగింపు సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌

● సుపరిపాలనతో సర్పంచ్‌లకు మంచి పేరు ● శిక్షణ ముగింపు సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌

ఖమ్మం సహకారనగర్‌: కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. ఖమ్మం డీపీఆర్‌సీ సెంటర్‌లో సర్పంచ్‌లకు ఐదు రోజులుగా ఇస్తున్న శిక్షణ శనివారం ముగియగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై న సర్పంచ్‌లు రాబోయే ఐదేళ్లు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. సర్పంచ్‌ల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించినందున పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, పచ్చదనం పెంపు, సమావేశాల నిర్వహణతో పాటు పన్నుల వసూళ్ల విషయంలోనూ శ్రద్ధ చూపాలని చెప్పారు. ప్రధానంగా చెత్త సేకరణ, నిర్వహణపై దృష్టి సారిస్తే వ్యాధులు దరిచేరవని తెలిపారు. జిల్లాలోని గ్రామపంచాయతీలకు ఆర్థిక సంఘం నిధుల కింద రూ.33 కోట్లు జమ అయ్యాయని, అందులో రూ.20 కోట్లు పారిశుద్ధ్యం, సిబ్బంది వేతనాలు, విద్యుత్‌ బిల్లులకు, రూ.13 కోట్లు అభివృద్ధి నిధులుగా ఉన్నాయని వెల్లడించారు. మార్చి 31లోపు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ నిధులతో అభివృద్దికి ప్రణాళిక రూపొందించుకోవాలని, తద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement