మధిర వాసికి అరుదైన గౌరవం
●2005లో డీఆర్డీఓ నుంచి ఆత్మనిర్భరతలో ఉత్తమంగా పని చేసినందుకు అగ్ని అవార్డు
●2007లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు
●2008 లో పాత్ బ్రేకింగ్ రీసెర్చ్ అవార్డు
●2013లో డీఆర్డీఓ నుంచి ‘సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
●2014లో ఎఫ్‌ఐసీసీఐ నుంచి గ్లోబల్ ఆర్‌అండ్‌డీ అవార్డు
●2014లో ఎన్‌ఐటీ వరంగల్ నుంచి డిస్టింగ్విష్డ్ అలుమ్ని ప్రొఫెషనల్ అచీవ్‌మెంట్ అవార్డు
●2015లో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాజెక్ట్ లీడర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు
●2016లో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నుండి మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అదే సంవత్సరంలో ఎఫ్‌టీఏసీసీఐ నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో లీడర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు సాధించారు.
మధిర: మధిరకు అరుదైన గౌరవం దక్కింది. పట్టణానికి చెందిన గడ్డమణుగు చంద్రమౌళి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. పట్టణంలోని రామాలయం వీధిలో నివాసం ఉండే సత్యనారాయణరావు–సరస్వతీదేవి దంపతులకు 1958 నవంబర్ 9న జన్మించిన చంద్రమౌళి ఇంటర్మీడియెట్ వరకు మధిరలోనే చదివారు. వరంగల్ ఎన్‌ఐటీలో బీటెక్, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. డీఆర్డీఓ లో 34 ఏళ్ల పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించి దేశ రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకాష్ క్షిపణి వ్యవస్థను తయారు చేసే బాధ్యతను ప్రముఖ శాస్త్రవేత్త ప్రహ్లాద్ రామారావుకు అప్పగించినప్పుడు, ముగ్గురు సభ్యులతో కూడిన తొలి బృందంలో చంద్రమౌళి కూడా ఉన్నారు. అవార్డుకు ఎంపికై న సందర్భంగా చంద్రమౌళి ‘సాక్షి’తో మాట్లాడు తూ.. మొబైల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ప్రయోగించే ఆకాశ్ క్షిపణి.. ఫైటర్ జెట్‌లు, చాపర్‌లు, యూఏవీలు, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, సూపర్‌సోనిక్ స్పీడ్‌తో కూడిన స్మార్ట్ బాంబులు, ఎత్తు లేదా పరిమాణంతో సంబంధం లేకుండా ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ ఫంక్షన్లతో సహా అనేక రకాల లక్ష్యాలను ఏకకాలంలో తటస్థీకరించగలదని చెప్పారు.
చంద్రమౌళికి పద్మశ్రీ అవార్డు
మధిర వాసికి అరుదైన గౌరవం


