జమలాపురంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

జమలాపురంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు

Jan 26 2026 4:16 AM | Updated on Jan 26 2026 4:16 AM

జమలాప

జమలాపురంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు

ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యక్ష నారాయణుడైన శ్రీసూర్య భగవానుడి ప్రీతిగా పంచ సూక్తాలు, మహా సౌర పఠనం చేశారు. భక్తుల సమక్షంలో పొంగళి తయారు చేసి శ్రీస్వామివారికి నివేందించారు. సూర్య భగవానుడి మూల మంత్రంతో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ రథ సప్తమి ప్రాధాన్యతను వివరించారు. సూర్య భగవానుడే నిత్యం కనిపించే దేవుడని, ఆరోగ్య ప్రదాత అని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త విజయదేవశర్మ, అర్చకులు రాజీవ్‌ శర్మ, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు సోమయ్య, కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

ముగిసిన

వన్యప్రాణుల గణన

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో వన్య ప్రాణుల, ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ (ఏఐటీఈ) – 2026 సర్వే ఆదివారంతో ముగిసింది. ఈనెల 19న ప్రారంభమైన గణనలో అటవీ శాఖ సిబ్బందితో పాటు ఆసక్తి గల పౌరులు కూడా భాగస్వాములయ్యారు. వన్యప్రాణుల పాదముద్రలు, సంచార ఆనవాళ్లను సేకరించి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. సర్వే ముగింపు సందర్బంగా నిర్వాహకులకు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో డీఎఫ్‌ఓ సిద్దార్థ విక్రమ్‌ సింగ్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ అనేది కేవలం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతీ పౌరుడి బాధ్యతని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్ల సహకారంతో పారదర్శకంగా, విజయవంతంగా సర్వే పూర్తి చేశామని వెల్లడించారు.

అంతర్జాతీయ సదస్సుకు గుబ్బగుర్తి యువకుడు

కొణిజర్ల : భారత పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 30 వరకు గోవాలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఇండియా ఎనర్జీ వీక్‌–2026 సదస్సుకు మండలంలోని గుబ్బగుర్తికి చెందిన దావా నాగేశ్వరరావు ఎంపికయ్యారు. స్వరాజ్‌ ఫౌండేషన్‌ కు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నాగేశ్వరరావు ఎన్‌జీఓ సేవల విభాగంలో ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో 124 దేశాల ప్రతినిధులతో నిర్వహిస్తున్న సదస్సుకు నాగేశ్వరరావును ప్రతినిధిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాజ్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా సదస్సుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.

కిన్నెరసానిలో కోలాహలం

పాల్వంచరూరల్‌: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 521 మంది పర్యాటకులు కిన్నెరసాని లోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.35,870, 350 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌కు రూ.20,650 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

జమలాపురంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు1
1/2

జమలాపురంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు

జమలాపురంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు2
2/2

జమలాపురంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement