పొత్తులు.. చిక్కుముడులు! | - | Sakshi
Sakshi News home page

పొత్తులు.. చిక్కుముడులు!

Jan 25 2026 7:21 AM | Updated on Jan 25 2026 7:21 AM

పొత్తులు.. చిక్కుముడులు!

పొత్తులు.. చిక్కుముడులు!

అక్కడ కలిసి సై..

ఏదులాపురం మున్సిపల్‌పై

ప్రాథమికంగా చర్చలు

కొత్తగూడెం కార్పొరేషన్‌లో

రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన

ఎవరికివారు అభ్యర్థుల కోసం అన్వేషణ

మిగతా మున్సిపాలిటీల్లో కలిసి పోటీకి నిర్ణయం

కలిసిమెలిసి ఉండి..

కాంగ్రెస్‌, సీపీఐ మధ్య ఇటీవల వరకు స్నేహపూర్వక వాతావరణమే కొనసాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పొత్తు పెట్టుకుని కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలిచారు. ఆపై ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సీపీఐ నేత నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇదంతా బాగానే ఉన్నా కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ – సీపీఐ మధ్య మొదలైన విభేదాలు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యాన తారాస్థాయికి చేరాయి. ఈ ప్రభావం ఎన్నికలపై పడనుందని రెండు పార్టీల కేడర్‌లో చర్చ జరుగుతోంది. ఏదులాపురం మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్లను ఇరు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎవరికి వారు తమదే పైచేయి కావాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

ఏదులాపురంలో ముందడుగు

పొత్తుతో బరిలోకి దిగేందుకు ఏదులాపురం మున్సిపాలిటీపై కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య ఒక దఫా చర్చలు జరిగాయి. ఇక్కడ తమకు బలం ఉన్నందున 12 వార్డుల్లో పోటీ చేస్తామని సీపీఐ ప్రతిపాదించగా, మొత్తం 32 వార్డుల్లోనూ తాము బలంగా ఉన్నామని కాంగ్రెస్‌ పార్టీ నేతలు భావిస్తున్నారు. బలాబలాలపై ప్రాథమికంగా చర్చించినా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయం తర్వాత స్థానాలు తేలనున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. పొత్తు కుదిరితే ఏ వార్డులో పోటీ చేయాలి.., ఏ వార్డులు వదులుకోవాలనే కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ మున్సిపాలిటీలో పొత్తు ఖరారైనట్లేనని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.

కొత్తగూడెంలో తకరారు

మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెంలో పాల్వంచ మున్సిపాలిటీతో పాటు సుజాతనగర్‌ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను విలీనం చేసి 60 డివిజన్లతో కార్పొరేషన్‌గా ఏర్పాటుచేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌ తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్‌ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి ఎన్నికలు కావడంతో బల నిరూపణకు రాజకీయ పార్టీలు వేదికగా ఎంచుకుంటున్నాయి. కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, సీపీఐ స్థానిక నాయకత్వం మధ్య కొంత స్నేహపూర్వక వాతావరణమే ఉన్నా, కొత్తగూడెంలో వైరం తారాస్థాయిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారు అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమయ్యారు. అయితే, షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికై నా పొత్తుల ప్రతిపాదన తెరపైకి వస్తుందనే ప్రచారం మాత్రం ఉంది.

ఉమ్మడి జిల్లాలోని వైరా, మధిర, ఇల్లెందు, అశ్వారావుపేట, కల్లూరు, సత్లుపల్లి మున్సిపాలిటీల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వైరాలో రెండు, మధిరలో మూడు, సత్తుపల్లిలో ఒకటి, అశ్వారావుపేటలో మూడు, ఇల్లెందులో మూడు వార్డుల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్‌ ఎదుట సీపీఐ నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయ్యే అవకాశముంది.

కాంగ్రెస్‌, సీపీఐ రాజకీయంపై ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement