ఎఫ్‌ఎల్‌ఎస్‌లో మొదటి స్థానాన నిలపాలి
రఘునాథపాలెం: ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్)లో జిల్లాను రాష్ట్రంతో పాటు దేశస్థాయిలోనూ అగ్రస్థానాన నిలిపేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైనీ సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎస్‌పై విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, కమిషనర్ నవీన్ నికోలస్ టీ–శాట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శనివారం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలం వీవీపాలెం జెడ్పీహెచ్‌ఎస్ నుంచి కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం డీఈఓ ఉపాధ్యాయులతో సమీక్షించాక 3వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
●చింతకాని: బాలికలు అన్ని రంగాల్లో ముందు నిలవాలని డీఈఓ చైతన్య జైనీ పేర్కొన్నారు. చింతకాని మండలం పందిళ్లపల్లి ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం బాలికలు కరాటే, యోగా ప్రదర్శనలు ఇవ్వగా డీఈఓ అభినందించారు. ఎంఈఓ ఎస్.రామారావు, ఖమ్మం మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై షాహీన, హెచ్‌ఎం డి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
●ఖమ్మం సహకారనగర్: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు డీఈఓ చైతన్యజైనీ శనివారం కిట్లు పంపిణీ చేశారు. ఖమ్మం ఎమ్మార్సీలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటర్లను చైతన్యపర్చేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీఎంఓ ప్రవీణ్‌కుమార్, ఏఎంఓ ప్రభాకరరెడ్డి, ఎంఈఓ శైలజాలక్ష్మి, డీఎస్‌ఓ శ్రీనివాసరావు దితరులు పాల్గొన్నారు.
డీఈఓ చైతన్య జైనీ


