ఆకట్టుకున్న కీర్తనల కచేరీ
నేలకొండపల్లి: భక్తరామదాసు స్వస్థలమైన నేలకొండపల్లిలో నిర్వహిస్తున్న ఆయన జయంతి ఉత్సవాలు శనివారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా హైదరాబాద్, ఖమ్మం, నేలకొండపల్లి, కూసుమంచి తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు ఇచ్చిన రామదాసు కీర్తనల కచేరీ ఆకట్టుకుంది. అలాగే, వివిధ రూపాల్లో కళాకారులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు, పూజారి సౌమిత్రి రమేష్, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ కనమర్లపూడి రమేష్‌తో పాటు కనమర్లపూడి శ్రీధర్, రాధాకృష్ణమూర్తి, నల్లాని మల్లికార్జున్‌రావు, ఓరుగంటి నారాయణరావు, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, నంచర్ల దేవీప్రసాద్, కడియాల నరేష్, కై లాసపు వెంకటేశ్వర్లు, రాయపూడి రోహిత్, భువనాసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట ఎమ్మెల్యే పూజలు
భక్తరామదాసు నడియాడిన నేలపై పుట్టిన ఇక్కడి ప్రజలు అదృష్టవంతులని ఏపీలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) అన్నారు. రామదాసు జయంతి ఉత్సవాలకు హాజరైన ఆయన మందిరంలో పూజలు అనంతరం మాట్లాడారు. చిన్నప్పుడు సెలవుల్లో ఇక్కడి బంధువుల ఇంటికి వచ్చే వాడినని, ఇప్పుడు అతిథిగా రావటం ఆనందంగా ఉందని తెలిపారు.


