శతాబ్ది ఉత్సవ స్ఫూర్తిని కొనసాగిద్దాం | - | Sakshi
Sakshi News home page

శతాబ్ది ఉత్సవ స్ఫూర్తిని కొనసాగిద్దాం

Jan 24 2026 7:19 AM | Updated on Jan 24 2026 7:19 AM

శతాబ్ది ఉత్సవ స్ఫూర్తిని కొనసాగిద్దాం

శతాబ్ది ఉత్సవ స్ఫూర్తిని కొనసాగిద్దాం

ఖమ్మంమయూరిసెంటర్‌: సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు ఇచ్చిన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలకు పునరంకితం కావాలని పార్టీ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం ఖమ్మం గిరిప్రసాద్‌ భవన్‌లో తోట రామాంజనేయులు అధ్యక్షతన జరగగా హేమంతరావు మాట్లాడారు. పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 18న నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యాన జాతీయ స్థాయి సమావేశాల్లో చేసిన తీర్మానాల అమలుకు పూనుకోవాలని కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పనిచేస్తామని, ఇదే సమయాన బలానికి అనుగుణంగా పోటీ చేస్తామని వెల్లడించారు. వివిధ పార్టీలు సంప్రదిస్తున్న నేపథ్యాన త్వరలోనే సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో బాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement