రాష్ట్ర స్థాయి టోర్నీలో అథ్లెట్ల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి టోర్నీలో అథ్లెట్ల ప్రతిభ

Jan 24 2026 7:19 AM | Updated on Jan 24 2026 7:19 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి టోర్నీలో అథ్లెట్ల ప్రతిభ

ఖమ్మం స్పోర్ట్స్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల అథ్లెటిక్స్‌ టోర్నీలో ఖమ్మం అథ్లెట్లు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో ఈ.వరుణ్‌, ఎం.వివేక్‌, ఎం.భవిత, డి.లోహిత్‌, బి.రుత్విక్‌, కె.మస్తాన్‌, డి.బిందు పతకాలు సాధించారు. వీరిని డీవైఎస్‌ఓ తుబూరు సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్‌ చీఫ్‌ కోచ్‌ ఎం.డీ.గౌస్‌, అసోసియేషన్‌ బాధ్యులు మందుల వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్‌ అహ్మద్‌, ఎం.డీ.హాలీం శుక్రవారం అభినందించారు.

మెడిసిన్‌ విద్యార్థినికి రూ.65వేల సాయం

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం 8వ డివిజన్‌ గోపాలపురానికి చెందిన మెడిసిన్‌ విద్యార్థి సూరారపు పూజిత నాలుగు సంవత్సరం ఫీజు కోసం గొల్లపుడి రాంప్రసాద్‌ శుక్రవారం రూ.65వేల నగదు అందజేశారు. ఈ నగదును మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా అందించి మాట్లాడారు. పూజిత మొదటి సంవత్సరం ఫీజుగా రూ.1.20 లక్షలు చెల్లించే సమయాన పువ్వాడ చేసిన సూచనతో ఆర్థిక సాయం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నాయకులు భూక్యా అశోక్‌, మోహన్‌, నరసింహ, శ్రీను, ఉపేందర్‌ పాల్గొన్నారు.

అదనపు గది నిర్మాణానికి ఆర్థిక సహకారం

ఖమ్మంలీగల్‌: జిల్లా కోర్టు ఆవరణలోని మహిళా బార్‌ రూమ్‌కు అనుసంధానంగా నిర్మిస్తున్న అదనపు గదికి న్యాయవాది మందడపు దివ్య ఆర్థిక సాయం అందజేశారు. ఆమె తల్లి ధనలక్ష్మి జ్ఞాపకార్ధం రూ.లక్ష నగదును శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తొండెపు వెంకటేశ్వరరావుకు అంచారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గద్దల దిలీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బాలుర హాస్టల్‌లో

డీడీ తనిఖీ

మధిర: మధిర ఎంప్లాయీస్‌ కాలనీలోని ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్‌ను సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జి.జ్యోతి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్‌రూమ్‌, వంటశాలలో పరిశీలించిన ఆమె మెనూ ప్రకారం భోజనం అందుతుందా, లేదా అని విద్యార్థులను అడిగి ఆరా తీశారు. విద్యార్థులకు వసతి సౌకర్యాల్లో రాజీ పడొద్దని వార్డెన్‌ జి.వెంకటేశ్వర్లుకు సూచించారు. అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ కె.వెంకటేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పీఎం విశ్వకర్మ

లబ్ధిదారులకు అవగాహన

ఖమ్మంగాంధీచౌక్‌: ఎంఎస్‌ఎంఈ–డీఎఫ్‌ఓ సమన్వయంతో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారుల కోసం మార్కెటింగ్‌ విధానాలపై శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఈ–కామర్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ డెవలప్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సీఎస్‌ఎస్‌ రావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌, టి.సీతారాంనాయక్‌, నకుల్‌రెడ్డి, ఏ.రవిప్రసాద్‌, రాజేష్‌, పవన్‌కుమార్‌, నిఖిల్‌, సంతయ్య పాల్గొనగా, పలువురు లబ్ధిదారులకు హాజరయ్యారు.

ఎన్నికల విధులపై

సంపూర్ణ అవగాహన

శిక్షణ నోడల్‌ అధికారి శ్రీరామ్‌

ఖమ్మం సహకారనగర్‌: మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యాన నిబంధనలు, విధులపై ఉద్యోగులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని శిక్షణా నోడల్‌ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ తెలిపారు. మునిసిపల్‌ ఎన్నికల నోడల్‌ అధికారులు, రిటర్నింగ్‌ అధికారులకు ఖమ్మం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రతీ అధికారి కొత్తగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లుగానే భావించి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ఇలా ప్రతీ అంశంలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా స్థాయి శిక్షకులు శైలేందర్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి టోర్నీలో  అథ్లెట్ల ప్రతిభ
1
1/2

రాష్ట్ర స్థాయి టోర్నీలో అథ్లెట్ల ప్రతిభ

రాష్ట్ర స్థాయి టోర్నీలో  అథ్లెట్ల ప్రతిభ
2
2/2

రాష్ట్ర స్థాయి టోర్నీలో అథ్లెట్ల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement