ప్రారంభమైన రామదాసు జయంత్యుత్సవాలు
● నామమాత్రంగా నిర్వహించిన యంత్రాంగం ● ప్రచారం లేకపోవడంతో వెలవెలబోయి వేదిక
నేలకొండపల్లి: పరమ భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(భక్తరామదాసు) జయంతి ఉత్సవాలు ఆయన స్వస్థలమైన నేలకొండపల్లిలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, భద్రాచలం దేవస్థానం, విద్వత్ కళాపీఠం ఆధ్వర్యాన ఉత్సవాలు నిర్వహిస్తుండగా, సరైన ప్రచారం చేయకపోవడంతో భక్తుల నుంచి ఆశించిన స్పందన కానరాలేదు. ఆది నుంచి నిర్వాహకులపై విమర్శలు వస్తున్నా ఏకపక్షం నిర్ణయాలతో ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వచ్చాయి. కళాకారులు తప్ప ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోగా, మండల స్థాయి అధికారులు కూడా కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
నగర సంకీర్తన, చిన్నారుల ప్రదర్శనలు
రామదాసు జయంత్యుత్సవాలను తొలిరోజు నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తనలో వివిధ వేషధారణల్లో చిన్నారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచారు. అలాగే, భక్తరామదాసు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ వెంకటలక్ష్మి, వివిధ సంఘాల ప్రతినిధులు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, నంచర్ల దేవీప్రసాద్, పాలడుగు పూర్ణచందర్‌ప్రసాద్, మహేష్, జెర్రిపోతుల అంజిని, నాగుబండి శ్రీనివాసరావు, దోసపాటి కల్పన, కొడిరెక్కల వినోద్, రేగూరి హన్మంతరావు, పసుపులేటి శ్రీలత, రాయపూడి రోహిత్, కాసాని నాగేశ్వరరావు, బచ్చలకూరి నాగరాజు, సామాల కోటేశ్వరరావు, కురాకుల ప్రమీల, ఓరుగంటి నారాయణరావు, యలమద్ది లెనిన్, కడియాల నరేష్, చిలకబత్తిని వీరబాబు, నల్లాని మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభమైన రామదాసు జయంత్యుత్సవాలు


