పౌరుల బాధ్యతలు తప్పక నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

పౌరుల బాధ్యతలు తప్పక నిర్వర్తించాలి

Jan 24 2026 7:19 AM | Updated on Jan 24 2026 7:19 AM

పౌరుల బాధ్యతలు తప్పక నిర్వర్తించాలి

పౌరుల బాధ్యతలు తప్పక నిర్వర్తించాలి

ఖమ్మం సహకారనగర్‌: పౌరులుగా అన్ని బాధ్యతలను నిర్వర్తించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, ఈసారి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో 23వ తేదీనే ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో కులం, మతం, ప్రాంతం, వర్గం, భాష అంతరాలు లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నందున యువత ముందుకు రావాలని సూచించారు. అంతేకాక ఎన్నికల్లో ప్రతిఒక్కరు స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఓటరు జాబితా సవరిస్తున్నందున అర్హులు పేర్లు నమోదు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. .

● జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు మున్సిపల్‌ కమిషనర్లుగా మున్వర్‌ అలీ, రాందుర్గారెడ్డి బదిలీపై వచ్చారు. వీరిద్దరు బాధ్యతలు స్వీకరించాక ఖమ్మంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఖమ్మం అర్బన్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో నివారణ చర్యలు వేగంగా చేపట్టాలని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాల విశ్లేషణ, బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు, తక్షణ చర్యలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐఆర్‌ఏడీ మేనేజర్‌ హరిబాబు, ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్‌ కిరణ్‌, ఈఈ యుగేందర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement