లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
ఖమ్మం లీగల్: ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి,రాజగోపాల్ సూచించారు. ఖమ్మంలోని న్యాయ సేవా సదన్‌లో ఇంచార్జ్ కార్యదర్శి ఎం.కల్పన అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యధిక కేసులు పరిష్కరించడం ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటిరకు 695 క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు 450, బ్యాంకు కేసులు వంద, భార్యాభర్తలకు సంబంధించినవి 150, మోటర్ ప్రమాద కేసులు 180, సివిల్ దావాలు 295తో పాటు ఇతరత్రా 2వేల కేసులను గుర్తించామని జిల్లా జడ్జి తెలిపారు. ఈ సమావేశంలో రెండో అదనపు న్యాయమూర్తి వెంపటి అపర్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్, న్యాయవాదులు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, గంగాధర్, సీత రామారావు, రాము, గుప్తా, పోలీసు ఉద్యోగులు పాల్గొన్నారు.
బస్టాండ్లలో తనిఖీ
చేసిన ఆర్‌ఎం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త, పాత బస్టాండ్ల పాటు వైరా బస్టాండ్‌ను ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ సోమవారం తనిఖీ చేశారు. ఆయా బస్టాండ్ల నుంచి బస్సుల ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఖమ్మం పాత బస్టాండ్‌లో రద్దీ సమయాన చోరీలు జరుగుతున్న నేపథ్యాన భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండడతో తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఆర్‌ఎం తెలిపారు.
‘ఐఈఎల్‌టీఎస్’ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన ఐఈఎల్‌టీఎస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విదేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు, స్కాలర్‌షిప్ పొందేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్హులైన వారు టీజీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ www. tgbcstudycircle. cgg. gov. in ద్వారా ఈ నెల 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 08742–227427, 94419 31359, 96521 61850, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
రిటైనింగ్ వాల్
పనులకు బ్రేక్?
బిల్లుల జాప్యమే కారణం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలోని కాలనీలు గ్రామాలను మున్నేటి వరద ముప్పు నుంచి రక్షించేలా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఆగిపోయినట్లు తెలిసింది. రూ.690 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టగా రెండు నెలల క్రితం వరదల కారణంగా బ్రేక్ పడింది. ఆతర్వాత ఇసుక కొరతతో కొన్ని రోజులు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సంస్థకు బిల్లులు రాకపోవడంతో మరోసారి పనులు నిలిచిపోయినట్లు సమాచారం. మున్నేటికి ఇరువైపులా 17 కి.మీ. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో రూ.90 కోట్ల బిల్లులే చెల్లించడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భూసేకరణ సమస్యల కారణంగా పలుచోట్ల పనులు ఆలస్యమవుతున్నాయి. భూసమస్య లేని ప్రాంతాల్లో పనులు వేగంగా చేపట్టే అవకాశం ఉన్నా పనులు ఆగిపోవడంతో వచ్చే సీజన్‌కై నా రిటైనింగ్ వాల్ పూర్తవుతందా, లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి


