
అసౌకర్యాల నడుమే చదువులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
● నాలుగేళ్లయినా పూర్తికాని పాఠశాల భవన నిర్మాణం ● అయినా పట్టించుకోని యంత్రాంగం, పాలకులు ● యడవల్లిలో విద్యార్థులు, గ్రామస్తుల ధర్నా
ముదిగొండ: అధికారుల పట్టింపులేనితనం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సమకూరడం లేదు. అదనపు తరగతి గదులతో పాటు భవనాల నిర్మాణాలకు రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నా సకాలంలో పూర్తికాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముదిగొండ మండలంలోని 36 ప్రాథమిక పాఠశాలలు, ఐదు యూపీఎస్‌లు, 14 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఉన్నాయి. వీటిల్లో 3,082 మంది చదువుకుంటుండగా.. పలు చోట్ల సౌకర్యాల లేమి వేధిస్తోంది. కమలాపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో గదులు శిథిలావస్థకు చేరి సరిపడా లేకపోవడంతో చెట్ల కిందే బోధన సాగుతోంది. బాణాపురం పాఠశాలలోనూ అదనపు గదుల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. యడవల్లి, న్యూలక్ష్మీపురం, కమలాపురం, మేడేపల్లి, వల్లభి హై స్కూళ్ల ఆవరణలో చిన్నపాటి వర్షానికే వరద చేరుతోంది. వేసవి సెలవుల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు తీర్చాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవకపోవడంతోవిద్యాసంవత్సరం ప్రారంభమై నా లుగు నెలలు దాటినా సమస్యలు అలాగేమిగిలిపోయాయి.
ఒకే ప్రాంగణంలో రెండు స్కూళ్లు
మండలంలోని యడవల్లిలో ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే జెడ్పీహెచ్‌ఎస్ కొనసాగుతోంది. ఫలితంగా తరగతి గదులే కాక మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిపోక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆట స్థలం లేకపోవడం, మరో పక్క ఇరుకు, చీకటి గదులతో అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యాన మరో ప్రాంతంలో కొత్త భవన నిర్మాణం నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టినా పూర్తికావడం లేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేక విద్యారుర్థులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. టెంట్ వేసి ప్లకార్డులతో రెండు గంటల పాటు ధర్నా కొనసాగించారు. అంతేకాక గేట్లకు తాళం వేసి ఉపాధ్యాయులను సైతం లోపలకు వెళ్లనివ్వలేదు. చివరకు ఎంఈఓ రమణయ్య, కాంప్లెక్స్ హెచ్‌ఎం కె.శాంతి, ఎస్‌ఐ కృష్ణప్రసాద్ చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
యడవల్లిలో అసంపూర్తిగా ఉన్న గదులు, భవన నిర్మాణ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
కాంట్రాక్టర్‌కు బిల్లులు అందక పనులు చేయలేదని చెబుతున్నారు. కొన్ని
పనులను అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టినా ఇంకొన్ని మిగిలిపోయాయి. – రమణయ్య,
ఎంఈఓ, ముదిగొండ

అసౌకర్యాల నడుమే చదువులు

అసౌకర్యాల నడుమే చదువులు