రాష్ట్రస్థాయి సెమినార్‌కు జిల్లా ఉపాధ్యాయుడు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సెమినార్‌కు జిల్లా ఉపాధ్యాయుడు

Oct 15 2025 7:57 AM | Updated on Oct 15 2025 7:57 AM

రాష్ట్రస్థాయి సెమినార్‌కు జిల్లా ఉపాధ్యాయుడు

రాష్ట్రస్థాయి సెమినార్‌కు జిల్లా ఉపాధ్యాయుడు

తిరుమలాయపాలెం: రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన – శిక్షణ మండలి సంయుక్త ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సెమినార్‌లో తిరుమలాయపాలెం జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయు డు పెసర ప్రభాకర్‌రెడ్డి పాల్గొననున్నారు. ‘విద్యార్థుల కెరీర్‌ ఎంపిక – కౌన్సెలింగ్‌ ప్రభా వం’ అంశంపై నిర్వహిస్తున్న ఈ సెమినార్‌కు ప్రభాకర్‌రెడ్డి ‘ఈరోజు నేర్చుకోండి – రేపు నాయకత్వం వహించండి’ శీర్షికతో రాసిన పరి శోధనా పత్రం ఎంపికై ంది. రాష్ట్రవ్యాప్తంగా అందిన 105పరిశోధనా పత్రాల్లో 30పత్రాలను ఎంపిక చేయగా ప్రభాకర్‌రెడ్డి ఆర్టికల్‌ కూడా ఉంది. ఈమేరకు హైదరాబాద్‌లో బుధవారం జరిగే సెమినార్‌లో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య ఆర్‌జేడీ సత్యనారా యణరెడ్డి, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్‌, ఎంఈఓ శ్రీనివాసరావు, హెచ్‌ఎం విజయకుమారి తది తరులు అభినందించారు.

రేపు జాబ్‌ మేళా

ఖమ్మం రాపర్తినగర్‌: నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పించేలా గురువారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో సేల్స్‌ మేనేజర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాకు 25–40 లోపు వయసు కలిగి డిగ్రీ అర్హత ఉన్న వారు హాజరుకావాలని, వివరాలకు 96183 40376 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

స్కేటింగ్‌లో జిల్లా

క్రీడాకారులకు పతకాలు

ఖమ్మం స్పోర్ట్స్‌: హైదరాబాద్‌లో ఈనెల 8నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి రోలర్‌ స్కేటింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. బాలికల అండర్‌–18 విభాగంలో జి.హలయ, అండర్‌–15లో టి.జ్ఞాన్వి, అండర్‌–8లో వీక్ష, బాలుర విభాగంలో అండర్‌–15 నుంచి డి.విధిలేష్‌, అండర్‌–6లో శిశిర్‌ కౌశల్‌, నిర్వాణ్‌ బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. అంతేకాక హలయ, జ్ఞాన్వి, వీక్ష డిసెంబర్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాగా, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్‌ సురేష్‌ మంగళవారం అభినందించారు.

అండర్‌–14

కబడ్డీ జట్ల ఎంపిక

ఖమ్మంస్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి పాఠశాలల విభాగంలో అండర్‌–14 కబడ్డీ జట్లను మంగళవారం ఎంపిక చేశారు. ఖమ్మంలోని సర్దార్‌ పటే ల్‌ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం జట్ల వివరాలను జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి వై.రామారావు ప్రకటించగా.. ఈ జట్లు 16 నుంచి సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా బాలుర జట్టుకు బి.ఓంకార్తీక్‌, పి.సంతోష్‌, డి.ధనుష్‌, వి.జయప్రకాష్‌, బి.ఆకా ష్‌, ఎ. మనోజ్‌, ఎ.అరుణ్‌, బి.అంజిబాబు, ఎ. శివ, ఎస్‌.గోపి, పి.బాబు, ఎస్‌.ప్రతీక్‌, బాలికల జట్టుకు సీహెచ్‌.గాయత్రి, డి.యామినిశ్రీ, పి. ప్ర వల్లిక,బి.వర్ష, పి.సింధుజ, ఎస్‌కే ఫరీదా,కె.భవా ని, పి.జాస్మిన్‌,ఎం.లిఖిత, కె.వినయశ్రీ, జి.సృజ న, ఎం.శ్రీజ ఎంపికయ్యారని వెల్లడించారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో ఆర్థికాభివృద్ధి

బోనకల్‌: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుతో మహిళల ఆర్థికాభివృద్ధితో పాటు ఇంకొందరికి ఉపాధి లభిస్తుందని ఇక్రిశాట్‌ సీనియర్‌ ఆఫీసర్‌ బానోతు శ్రీను తెలిపారు. బోనకల్‌ ఐకేపీ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఇక్రిశాట్‌ అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుండి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఈ రుణాలతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ప్రధానంగా పండే పంటల ఆధారంగా ఆహార ఉత్పత్తులు తయారుచేసి అమ్ము తూ లాభాలు గడించేలా మహిళలను వీఓఏలు ప్రో త్సహించాలని సూచించారు. డీపీఎంలు శ్రీనివాస్‌, రాజారావు, ఏపీఎం వెంకటేశ్వర్లు, సీఈఓ సాయిగణేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement