
పకడ్బందీగా చట్టం అమలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలయ్యేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆమె ఈ చట్టం కింద జారీ చేసిన అనుమతులు, రెన్యువల్స్ కోసం వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులను సీజ్ చేయడమే కాక పోలీసుల అభిప్రాయం తీసుకున్నాక సరైన ఆధారాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలు నిబంధనల ప్రకారం జరగాలని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో అదనపు డీసీపీ ప్రసాదరావు, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందునాయక్, ఐఏంఏ అధ్యక్షులు రెహానాబేగం, అధికారులు వెంకటరమణ, రామారావు, నరేందర్, రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జనరల్ ఆస్పత్రిలో తనిఖీ
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ మంగళవారం తనిఖీ చేశారు. పోషకాహర లోపంతో జన్మించిన చిన్నారులకు వైద్యసేవలు అందించే ఎన్‌ఆర్‌సీ వార్డుతో పరిశీలించి సేవలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం చిన్నారులకు పౌష్టికాహరం పంపిణీ, డయోగ్నస్టిక్ హబ్‌లో పరీక్షలు, సదరమ్ క్యాంపుల నిర్వహణ, మరుగుదొడ్ల మరమ్మతులను పరిశీలించి సూచనలు చేశారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ