
‘పేట’ చెరువు అభివృద్ధికి రూ.4.86 కోట్లు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం మామునూరులోని పేట చెరువును పర్యాటకంగా అభివృద్ధిచేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ. 4.86 కోట్లు మంజూరు చేశారని మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు తెలిపారు. చెరువును టూరిజం శాఖ డీఈ ఎన్.రామకృష్ణ, ఏఈ నరేష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు మారాబత్తుల మోహన్‌రావు, గంతాల లక్ష్మారావు, గంగారపు కృష్ణారావు, బండారు రామారావు, రాధాకృష్ణ పాల్గొన్నారు.