
ప్రజా ఉద్యమ నాయకుడు జియావుద్దీన్
తిరుమలాయపాలెం: ప్రజా ఉద్యమాలకే కాక ఉపాధ్యాయ ఉద్యమానికి ఎస్.డీ.జియావుద్దీన్ సారథిలా నిలిచారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం నాయకుడు, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు జియావుద్దీన్ సంస్మరణ సభ మండలంలోని సుబ్లేడులో గురువారం నిర్వహించగా ఆయన మాట్లాడారు. జీవితకాలం గిరిపుత్రుల అభివృద్ధి కోసం తపించడమే కాక ఉద్యోగ విరమణ తర్వాత సీపీఎంలో ప్రజాఉద్యమాలు నిర్మించారని తెలిపారు. ప్రజా సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశాడని కొనియాడారు. కాగా, కేంద్రప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం కాపాడుకోడమే కాక రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నందున బీజేపీని గుణపాఠం చెప్పేలా కార్యకర్తలు సిద్ధం కావాలని తమ్మినేని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, బండి రమేష్, షేక్ బషీరుద్దీన్, జియావుద్దీన్ జావీద్‌తో పాటు రామసహాయం నరేష్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, బెల్లం శ్రీనివాస్, మందుల రాజేంద్రప్రసాద్, గొర్రెపాటి రమేష్, సోమనపల్లి వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
●ఏన్కూర్: మండలంలోని ఇమామ్‌నగర్‌కు చెందిన బానోతు శ్యామ్‌కుమార్ మృతి చెందగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్, సీపీఎం నాయకులు వేముల కృష్ణప్రసాద్, గుడ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం