
అందరిపైనా అమ్మవారి ఆశీస్సులు
ఖమ్మం మయూరిసెంటర్: దుర్గామాత ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. ఖమ్మం 48వ డివిజన్‌లో కార్పొరేటర్ తోట రామారావు, గోవిందమ్మ ఆధ్వర్యాన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించనుండగా విగ్రహాన్ని గురువారం వేదికపైకి చేర్చారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు జరిగే పూజల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
పొంగులేటి వ్యాఖ్యలు గర్హనీయం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పొంగులేటి అదే కేటీఆర్‌తో స్నేహం చేశారని, అదే కేటీఆర్ 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మున్నూరు కాపు సంఘం నాయకులు ఆకుల గాంధీ, తోట రమేష్, తోట లక్ష్మణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర