
అటవీ శాఖకు నూతన హంగులు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి అటవీశాఖకు జిల్లా కేంద్రం తరహాలో నూతనహంగులు రానున్నాయి. టింబర్ డిపోప్రాంగణంలోని స్థలాన్నిపరేడ్‌గ్రౌండ్‌గా తీర్చిదిద్దా రు. ఇందులోరూ.2లక్షలతో అటవీ అమరవీరుల స్తూపం, రూ.4 లక్షలతో పోడియం ఏర్పాటు చేశారు. డివిజన్‌స్థాయిలో ఉద్యోగులకు శిక్షణ, సమావేశాల నిర్వహణకోసం రూ.12 లక్షలతో మీటింగ్‌హాల్ నిర్మించారు.
నీలాద్రి అర్బన్ పార్కులో..
సందర్శకుల ఆదరణ పెరుగుతున్న నీలాద్రి అర్బన్ పార్కుకు రూ.10 లక్షలతో మారో రెండు బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అర్బన్ పార్కులోని వన్యప్రాణులు బయటకు రాకుండా.. వీధి కుక్కలు లోపలికి చొరబడకుండా కన్జర్వేషన్ జోన్ ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో 1.5 కిలోమీటర్ల మేర చైన్‌లింగ్ ఫెన్సింగ్‌తో రక్షణ చర్యలు చేపట్టారు. ఈ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని సత్తుపల్లి ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల, రేంజర్ స్నేహలత తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
చింతకాని: మండలంలోని మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తిమ్మినేనిపాలెం మున్నేరు నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఎస్‌ఐ నాగుల్‌మీరా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నేడు రూ.90 కోట్ల పనులు ప్రారంభం