
కబడ్డీ ఎంపిక పోటీలకు స్పందన
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలకు స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 200 మంది బాలురు, 80 మంది బాలికలు రావడంతో ఎంపిక ప్రక్రియ కష్టంగా మారిందని నిర్వాహకులు తెలి పారు. కాగా, జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. ప్రక్రియను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తుంబూరు దయాకర్‌రెడ్డి, కె.క్రిష్టాఫర్‌బాబు పర్యవేక్షించారు. కార్యక్రమంలో నాగప్రాసద్, సీహెచ్. సుధాకర్, లాలయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లా జట్టుకు ఎంపికై న వారి వివరాలు..
బాలుర జట్టు: ఎ.సతీశ్, జి.వినయ్, డి.నాగఅఖిల్, జె.ఉమేశ్‌రెడ్డి, విఘ్నేశ్, కె.నితిన్, ఎ.నాగరాజు, బి.గణేశ్, కె.అశోక్‌కుమార్, బి.చిరు, పి.భార్గవకల్యాణ్, ఎస్‌కే నశ్రీద్, బి.జగన్‌నాయక్, బి.రాఘవ, జె.వివేక్, యు.వెకంటకృష్ణ.
బాలికల జట్టు: బి.హనీ, జి.చరణ్య, జి.శైలజ, బి.చైత్ర, సప్తిక, సిరిచందన, నవిత, లిఖిత, తేజ, బాలనాగ, నాగమణి, కీర్తన, నాగ, శ్రీజ, శాన్వి, రేణుక, శ్రావణి, స్ఫూర్తి.