
రూ.కోట్ల విలువైన భూమి స్వాధీనం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం పాకబండ రెవెన్యూలో రూ.కోట్ల విలువ చేసే సాగర్ మేజర్ కాల్వ–2 మిగులు భూమిని అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కాల్వ భూమి ఆక్రమణకు గురవుతోందని అందిన ఫిర్యాదుతో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా సర్వే నంబర్ 88లో రెండెకరాల నాలుగు గుంటల భూమిని ఓ వ్యక్తి ఆయన భూమిలో అక్రమంగా కలుపుకున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ మార్కెట్‌లో రూ.10 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఆపై భూమిని చదును చేయించగా ఫెన్సింగ్ ఏర్పాటు పనులు పూర్తయ్యాక మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు కె.శ్రీనివాస్, నాగేశ్వరరావు, జలవనరుల శాఖ డీఈ ఉదయప్రతాప్‌తో పాటు కేఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
‘సాగర్’ స్థలాల అన్యాక్రాంతంపై
ఫిర్యాదులు రావడంతో చర్యలు