
సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
చింతకాని/బోనకల్: నైజాం నిరంకుశ పాలనను అంతమొందించేందుకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు. చింతకాని మండలం ప్రొద్దుటూరులో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తాళ్లపల్లి రాములు, బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించి మాట్లాడారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం రాచరికం, నిర్బంధానికి వ్యతిరేకంగా సాగితే బీజేపీ మాత్రం ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సాయుధ పోరాటంలో నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో అన్ని వర్గాల వారు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్‌రావు, దూసరి గోపాలరావు, యంగల ఆనందరావు, అబ్బూరి మహేష్, పదిమెల వెంకటనర్సయ్య, పగిడిపల్లి ఏసు, తాళ్లపల్లి అజయ్, పెంట్యాల చలమయ్య, వేల్పుల కోటయ్య, తుళ్లూరు శ్రీనివాసరావు, తుడుం పాలరావు, పెంట్యాల రామారావు, పాపినేని రంగారావు, పులి యజ్ఞనారాయణ, జక్కుల రామారావు, వల్లంకొండ బ్రహ్మం, కొత్తపల్లి రమేష్, తమ్మారపు లక్ష్మణ్‌రావు, తమ్మారపు బ్రహ్మయ్య, కొత్తపల్లి కృష్ణ పాల్గొన్నారు.
పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
బోనకల్: అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో దెబ్బతిన్న పత్తి పంటలను సీపీఐ జిల్లా కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అధిక వర్షాలతో పత్తి దిగుబడి పడిపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం సర్వే చేయించి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. నాయకులు, రైతులు జక్కుల రామారావు, యంగల ఆనందరావు, పుచ్చకాయల తిరుపతయ్య, గోళ్ల కనకయ్య, చింతలచెర్వు మదారయ్య పాల్గొన్నారు.