
వారం పాటు విమోచన దినోత్సవం
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యాన రాష్ట్రంలో వారం పాటు నిర్వహించనున్నామని ఆ పార్టీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతలు హాజరు కాకపోవడం గర్హనీయమన్నారు. ఇదే సమయాన ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ రాజ్యాంగంపై మాట్లాడడం ద్వంద్వ స్వభావానికి నిదర్శనమని తెలిపారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరఫరా చేసిన యూరియాను దారి మళ్లింంచడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇందుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైఫల్యమే కారణమని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 11ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తామని పొంగులేటి వెల్లడించారు.
●తిరుమలాయపాలెం: మండలంలోని సుబ్లేడులో పోరాటయోధుడు సోయబ్ ఉల్లాఖాన్ విగ్రహానికి బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి నివాళులర్పించారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినో త్సవంగా జరపనున్న నేపథ్యాన రాష్ట్రవ్యాప్తంగా పోరాటయోధులను స్మరించుకోనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరా వు, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, నున్నా రవికుమార్, దొంగలసత్యనారాయణ, ఈవీ.రమేష్, జి.వెంక టేశ్వర్లు, సుబ్బారావు, ప్రభాకర్‌రెడ్డి, గుత్తా వెంకటేశ్వర్లు, సుదర్శన్ మిశ్రా, నల్లగట్టు ప్రవీణ్‌కుమార్, రవిరాథోడ్, విజయరెడ్డి, రజినీరెడ్డి, నెల్లూరి బెనర్జీ, నగరికంటే వీరభద్రం, మహేష్, ఇందూరి మహేష్, గంట్ల లక్ష్మారెడ్డి, భూక్యా వెంకటేష్, నల్లగట్టు ఉపేందర్, నాగరాజు, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి