
ఖమ్మం.. సాహిత్య గుమ్మం
ఖమ్మంగాంధీచౌక్: ఆధునిక సాహిత్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఖమ్మం కేంద్రంగా నిలుస్తోందని కవి, విమర్శకులు, మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో కవి వంశీకృష్ణ తల్లి తాటికొండల భ్రమరాంబ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. ఈ పురస్కారాన్ని నరసింహారెడ్డికి అందజేయగా ఆయన మాట్లాడారు. భక్త రామదాసు, ప్రముఖ భాషావేత్తలు నడియాడిన నేలపై సాహిత్య పురస్కారం అందుకోవడం తనకు ప్రత్యేకమని తెలిపారు. అనంతరం రచయిత్రి, అనువాదకురాలు స్వర్ణ కిలారి, కుటుంబీకులు రాసిన భ్రమరాంబ స్మృతి గీతాల సంపుటి ‘నెనరు–నెమరు’ను ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కవి, సంపాదకులు ఆనందాచారి మాట్లాడగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహామండలి సభ్యులు ప్రసేన్‌తో పాటు మువ్వా జయశ్రీ, వంశీకృష్ణ, సీతారాం, రవిమారుత్, ఇబ్రహీం, నిర్గుణ్, సుభాషిణి, నీలిమ, వీఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.
‘నెనరు–నెమరు’ సంపుటి ఆవిష్కరణలో
వక్తలు