
అవసరం మేరకే ఎరువులు వినియోగించాలి
సత్తుపల్లిరూరల్: పంటలకు అవసరం మేరకే నత్రజని ఎరువు వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. సత్తుపల్లి మండలంలోని కిష్టారం, తుంబూరు, గంగారం పీఏసీఎస్‌ల్లో యూరి యా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పంటలకు కొంత మొత్తంలో నానో యూరియా, నానో డీఏపీలను పిచికారీ చేస్తే ఇక్కట్లు ఉండవని తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులు పంపిణీ చేస్తున్నందున ఎక్కడా కొరత లేదని వెల్లడించారు. అనంతరం కిష్టారం, బేతుపల్లిల్లో పంటల నమోదు ప్రక్రియను డీఏఓ తనిఖీ చేశారు. సత్తుపల్లి ఏడీఏ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్‌హెచ్‌ఓ టి.శ్రీహరి, ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓలు డి.నరేష్, టి.సాయివాసంతి, కె.ఆశాజ్యోతి పాల్గొన్నారు.