
రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి
ఖమ్మం సహకారనగర్: అడ్డంకులను అధిగమించి రాజీవ్ స్వగృహ సముదాయాన్ని దక్కించుకోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ సముదాయాన్ని ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీ బిడ్‌లో కై వసం చేసుకోగా, నాయకులు శుక్రవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక ఒరవడి కలిగిన జిల్లా ఉద్యోగులు ప్రాజెక్టును విజయవంతం చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొనిదెన శ్రీనివాసరావు, టీజీవోస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, నాయకులు విజయ్, రాంబాబు, జైపాల్, వెంకన్న, దుర్గాప్రసాద్, హరికృష్ణ, కోణార్క్, ప్రభాకరాచారి, రుక్మారావు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను వివిధ పార్టీల నాయకులతో కలిసి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భద్రత, అగ్నిమాపక యంత్రాల నిర్వహణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాలతో కలెక్టర్ అనుదీప్