
అక్రమ కేసులు గర్హనీయం
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం గర్హనీయం. ప్రభుత్వాలు ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సరైన విధానం అనిపించుకోదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు నియంతృత్వంతో వ్యవహరించడం, పత్రికాస్వేచ్ఛను అణచివేసేలా ప్రభుత్వాలు ప్రయత్నించడం శోచనీయం. మీడియా కార్యాలయాలపై దాడులు, జర్నలిస్టులపై కేసులను ఖండిస్తున్నాం.
– కర్లపూడి శ్రీనివాసరావు,
మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఖమ్మం