
మిర్చి సీజన్ నాటికి నిర్మాణాలు పూర్తి
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్
లక్ష్మీబాయి
ఖమ్మంవ్యవసాయం: మిర్చి పంట సీజన్ ప్రారంభయ్యే నాటికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మోడల్ మార్కెట్ నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశించారు. ఖమ్మం మార్కెట్‌లో రూ. 155.30 కోట్లతో నిర్మాణ పనులను అధికారులతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. మిర్చి క్రయవిక్రయాలకు ఐదు షెడ్లు, రైతుల విశ్రాంతి భవనం, కార్మికులు, దడవాయిల కార్యాలయాలు, శీతల గిడ్డంగి నిర్మాణాలను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశమైన డైరెక్టర్ మాట్లాడుతూ రైతులు, ఉద్యోగులకు తాగునీటి సౌకర్యం కల్పించేలా ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలు, విద్యుత్ లైట్ల ఏర్పాటు, డ్రెయినేజీ వ్యవస్థపై చర్చించారు. అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణ్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.