
ఎర్రబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలం డిపో కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు తగ్గించిన మస్టర్లను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యాన కార్మికులు గురువారం ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మొదటి షిఫ్ట్‌లో రీజియన్‌లోని అన్ని డిపోల్లో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఖమ్మం డిపోలో జరిగిన నిరసనలో జేఏసీ నాయకులు పిట్టల సుధాకర్, బూదాటి శ్రీనివాసరెడ్డి, నిమ్మటూరి సత్యం, బత్తినేని హనుమంతరావు, పగిళ్లపల్లి నరసింహారావు, గుగ్గిళ్ల రోశయ్య, బేతంపూడి బుచ్చిబాబు, నర్సింహాచారి, పద్మా, జ్యోతి, సంధ్యారాణి, ఉమారాణి, నాగవీర, భాస్కర్, లాల్‌బీ పాల్గొన్నారు.
ట్రాఫిక్ సీఐ–2గా
అప్పలనాయుడు
ఖమ్మంక్రైం: ఖమ్మం ట్రాఫిక్ సీఐ–2గా అప్పలనాయుడు నియమితులయ్యారు. ప్రస్తుతం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఆయనను ట్రాఫిక్ సీఐగా నియమిస్తూ సీపీ సునీల్‌దత్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ స్థానంలో ఉన్న సాంబశివరావును తిరిగి హెడ్ క్వార్టర్స్‌కు కేటాయించారు. ఈమేరకు అప్పలనాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు.
‘ఆశా’లకు రూ.18వేల వేతనం చెల్లించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించి వారి సర్వీసును క్రమబద్ధీకరించేలోగా రూ.18వేల వేతనం చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు యూనియన్(సీఐటీయూ) జిల్లా ఏడో మహాసభ జిల్లా అధ్యక్షురాలు జె.మంగమ్మ అధ్యక్షతన గురువారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఆశాల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు వేతనం పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, పి. రమ్య, పి.మోహన్‌రావు, విఠల్, చంద్రశేఖర్, శీలం నర్సింహారావు, జిల్లా ఉపేందర్, నాయకులు నవీన్‌రెడ్డి, బషీరుద్దీన్, వీరన్న, ఆశావర్కర్ల యూని యన్ నాయకులు జె.మంగమ్మ, బి.అమల పాల్గొన్నారు.
బ్యాంక్ అధికారులకు
అవగాహన
ఖమ్మంమయూరిసెంటర్: స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ విధానంపై ఉమ్మడి జిల్లాలోని బ్యాంకుల మేనేజర్లకు గురువారం అవగాహన కల్పించారు. ఖమ్మంలోని టీటీడీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల లింకేజీ కార్యకలాపాలు, రుణ పరిమితి, రుణబీమా, ఆర్‌బీఐ మార్గదర్శకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు కె.శ్రీనివాసరావు, నరసింహస్వామి, బాలస్వామి, డీఆర్‌డీఓ ఆర్.సన్యాసయ్య, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికారులు జయశ్రీ, నీలేష్, ఖమ్మం, ఆంజనేయులు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

ఎర్రబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన