
నిండా ముంచిన కల్తీ విత్తనాలు?
వేంసూరు: కల్తీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు కంపెనీ యాజమాన్యం న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. వేంసూరు మండలం కందుకూరుకు చెందిన పలువురు రైతులు కరీంనగర్‌కు చెందిన వరుణ్ కంపెనీ బీపీటీ 2782 రకం వరి విత్తనాలతో 1,500 ఎకరాల్లో పంట సాగు చేశారు. అయితే, 120 రోజుల్లో ఈతకు రావాల్సిన వరి 90 రోజులకే 40 శాతం మేర ఈనడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యాన పొలాలను గురువారం మాజీ ఎమ్మెల్యే సండ్ర పరిశీలించి మాట్లాడారు. సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తోందని భరణిపాడు, మర్లపాడు, లింగపాలెం, కుంచపర్తి, చౌడవరం గ్రామాల రైతులు వరి సాగు చేశారని తెలిపారు. కానీ విత్తన లోపంతో ఒక కందుకూరులోనే 1,500 ఎకరాల్లో నష్టపోయారని చెప్పారు. అధికారులు, కంపెనీ ప్రతినిధులు పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు గొర్ల ప్రభాకర్‌రెడ్డి, పాల వెంకటరెడ్డి, పగట్ల వెంకటేశ్వరరావు, జుబ్బూరి నాగరాజు, దొడ్డ వెంకటకృష్ణారెడ్డి, మందపాటి మహేశ్వరరెడ్డి, గొర్ల సత్యనారాయణరెడ్డి, ఎర్ర రమేష్, గండ్ర రామిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య