
వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు
కల్లూరు: వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిత తెలిపారు. వివరాలిలా.. కల్లూరు మున్సిపాలిటీ పరిధి లోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన కంటిపూడి యోహాన్‌తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. కాగా, యోహాన్ ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేస్తుండగా.. తట్టుకోలేక గడ్డిమందు తా గింది. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. దీనిపై మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేయగా యోహాన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.