
స్థానిక ఎన్నికల్లో కష్టపడాలి
● రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జిల్లానే కారణం ● ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కారణమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన దళిత విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచేలా తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్లను గెలిపించుకునే బాధ్యత దళితులపై ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతీ దళిత బిడ్డకు అనేక అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దళిత విజయోత్సవ సభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
బీజేపీ దిష్టిబొమ్మ దహనం..
రాయ్‌బరేలిలో లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీపై బీజేపీ దాడిని ఖండిస్తూ పాత బస్టాండ్ ముందు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, రాష్ట్ర కన్వీనర్ దర్జీ చెన్నారావు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు దాసరి దానియేలు, నాయకులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజెండ్ల సాయి కుమార్, సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.