
‘రేషన్’ సమస్యలుంటే ఫిర్యాదు చేయండి
నేలకొండపల్లి: ఆహార భద్రత కార్డుదారులకు చేరువయ్యేలా కేంద్ర ప్రభుత్వం అన్నా సహాయత కార్యక్రమానిన ప్రవేశపెట్టిందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన రేషన్ దుకాణాలను తనిఖీచేశారు. బియ్యం నాణ్యత ఎలా ఉందని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. అన్నా సహాయత కార్యక్రమంపై అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రేషన్ కార్డుదారులకు ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాట్సాప్ నంబర్ 98682 00445 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 14457 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్లను రేషన్ దుకాణాల వద్ద బోర్డుపై ప్రదర్శించాలని డీలర్లను ఆదేశించారు. అనంతరం నేలకొండపల్లి గురుకుల బాలిక పాఠశాలను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ముదిగొండ మండలంలోని శ్రీ సత్యసాయి రైస్‌మిల్‌ను సందర్శించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఫౌరసరఫరా శాఖ అధికారి
చందన్‌కుమార్