
ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి
సత్తుపల్లిరూరల్: ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘసటన సత్తుపల్లి మండలం సత్యంపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రుద్రాక్షపల్లి పంచాయతీ సత్యంపేట గ్రామంలో సోయం శివ, సంధ్యారాణి దంపతుల సంవత్సరం వయసు గల కుమార్తె మోక్షదుర్గ.. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ మూతలేని ఇంకుడుగుంతలో పడింది. కుటుంబ సభ్యులు గమనించకపోవడతో కొద్ది సేపటికి చిన్నారి మృతి చెందింది. ఆ తర్వాత చిన్నారి కోసం వెదుకుతుండగా ఇంకుడుగుంతలో మృతదేహం కనిపించింది. కాగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ బుధవారం సత్యంపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి చిన్నారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కారు పల్టీ
ముదిగొండ: ఖమ్మం – కోదాడ నేషనల్ హైవేపై కారు పల్టీ కొట్టగా ఓ యువకుడికి గాయాలైన ఘటన ముది గొండ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఖమ్మానికి చెందిన ఆసిఫ్ కారులో కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్నాడు. ముదిగొండ సమీపంలో కారు పల్టీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న ఆసిఫ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి